లివర్మోర్ టెంపుల్లో భూవరాహ యాగం
కాలిఫోర్నియాలో ఉన్న లివర్మోర్లోని శివ-విష్ణు ఆలయంలో ఆగస్టు 1 నుంచి 4 వరకు ‘శ్రీ భూవరాహయాగా’న్ని నిర్వహిస్తున్నారు. జయేంద్ర సరస్వతి, స్వామి చిన్మయానంద ఆశీస్సులతో హిందూ కమ్యూనిటీ అండ్ కల్చరల్ సెంటర్ ఈ ఆలయాన్ని నిర్మించింది. 1986లో కుంభాభిషేకం, 1998, 2010లో మహా కుంభాభిషేకాలు, 2018లో అతిరుద్ర మహాయజ్ఞం, శత చండీహోమం, 2019, ఫిబ్రవరిలో పురుషసూక్త యజ్ఞాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఇప్పుడు శ్రీ భూవరాహ యాగాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా వేద పండితుల సమక్షంలో 5 కాలాలలో భూసూక్తం (508 సార్లు), వరాహ గాయత్రీ మంత్రం (4320 సార్లు), వరాహ కవచం (200 సార్లు) పఠిస్తూ యాగం చేస్తారు. రోజుకొక విశేష పూజా కార్యక్రమం ఉంటుంది. విశ్వక్సేనపూజ, అకల్మష హోమం,
భూమి పూజ, వాస్తు హోమం, యాగశాల ప్రవేశం, కుంభ ఆవాహనం, అగ్ని ప్రతిష్టాపన, అమ్మవారికి సమర్పించే నూతన స్వర్ణకవచానికి పంచగవ్య అధివాసం, జల అధివాసం, క్షీర అధివాసం, శయనాధివాసం, చివరిగా మహా పూర్ణాహుతి చేయనున్నారు.
ఈ దేవాలయంలో శ్రీ భూవరాహ యాగం నిర్వహించడం ఇదే తొలిసారి. ‘భూ వరాహ స్వామి జ్ఞాన సంపదకు ప్రతీక. ఈ యాగంలో పాల్గొన్న వారికి, స్వామిని భక్తి శ్రద్ధలతో సేవించినా సర్వదోషాలు నివత్తమై మోక్షం ప్రాప్తిస్తుందని, కోర్కెలు నెరవేరుతాయని నిర్వాహకులు తెలిపారు. ప్రకతి వైపరీత్యాలనుంచి కూడా స్వామి రక్షిస్తాడని భక్తుల విశ్వాసం’ అని యాగం నిర్వాహకులు వెల్లడించారు. యాగంలో భారీ సంఖ్యలో పాల్గొనాలని ప్రవాస భారతీయులకు హిందూ కమ్యూనిటీ అండ్ కల్చరల్ సెంటర్ విజ్ఞప్తి చేస్తోంది. వివరాలకు 925-449-6255 సంప్రదించాలని తెలిపింది. టెంపుల్ వెబ్సైట్ Click here ను ఇతర వివరాలకోసం చూడవచ్చు.













