ఫ్లోరిడా లో ఇన్-క్లాస్ తరగతుల పునఃప్రారంభం.. రాజ్యాంగ విరుద్ధం గా పరిగణించిన లియోన్ కౌంటీ సర్క్యూట్ కోర్టు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి నష్టపోతున్న దేశాల్లో అమెరికా అగ్రస్థానం లో ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా అమెరికా లోని కొన్ని రాష్ట్రాలు మరియు ఉపాధ్యాయ సంఘాలు 2020-2021 విద్యా సంవత్సరానికి ఇన్-క్లాస్ తరగతులు ప్రారంభించాలి అని అద్ధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పై వెతిరేకత వ్యక్తం చేయగా తాజాగా విద్యా కమిషనర్ రిచర్డ్ కోర్కోరన్ “ఫ్లోరిడా విద్యా సంస్థలు వారానికి ఐదు రోజులు ఇన్-క్లాస్ తరగతుల తో పునఃప్రారంభించాలి” అని జారీ చేసిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి అని రెండు వ్యాజ్యాలు, ఒకటి ఆరెంజ్ కౌంటీ మరియు మరొకటి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం దాఖలు చేసిన దావా పైన సోమవారం 24 ఆగస్టు న లియోన్ కౌంటీ సర్క్యూట్ కోర్టు న్యాయ మూర్తి చార్లెస్ డాడ్సన్ “విద్యా కమిషనర్ రిచర్డ్ కోర్కోరన్ పునఃప్రారంభం ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధం అని , బ్రిక్ అండ్ మోర్టార్ స్కూల్స్ ప్రారంభించటానికి సంబంధించి స్థానిక విద్యాసంస్థ బోర్డుల నిర్ణయం తీసుకోవడాన్ని మరియు విద్యాసంస్థ నిధుల కి ఆగస్టులో ప్రారంభ తేదీతో షరతుల ప్రణాళికను ఖండిస్తున్నట్టు తీర్పు వెల్లడించారు.
విద్యా సంస్థలు వైద్య నిపుణుల సలహా తో స్థానిక నిర్ణయాధికారులు నిర్ణయించినప్పుడు తిరిగి తెరవాలి అలా చేయడం సురక్షితం మరియు ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేసే రాష్ట్ర ఆర్థిక జరిమానా ముప్పు లేకుండా విద్యా సంస్థల పునఃప్రారంభం అమలు జరగాలి అని తీర్పులో పేర్కొన్నట్లు తెలిసింది. తల్లాహస్సీలోని అధికారులు నిర్ణయించిన తేదీన పాఠశాలలు తిరిగి తెరిస్తే కోలుకోలేని హాని జరుగు తుందని ఫ్లోరిడా ఎడ్యుకేషన్ అసోసియేషన్ (FEA) వ్యక్తం చేసింది. కోర్కోరన్ మాత్రం తీర్పు ముందు, రాష్ట్రవ్యాప్తంగా 1.6 మిలియన్ల మంది విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో 2020-21 విద్యా సంవత్సరానికి నమోదు కాగా అందులో సగానికి పైగా విద్యార్థులు 2020-21 విద్యా సంవత్సరానికి వ్యక్తి తరగతులను ఎంచుకోవడంతో “మేము కొన్ని మిలియన్ సార్లు చెప్పాము ఇప్పుడు కూడా చెప్తున్నాను మేము ఈ దావాను గెలుస్తాం అని 100% నమ్మకంగా ఉన్నాము.” అని ధీమా వ్యక్తం చేశారు.













