స్పెల్లింగ్ బీ విజేత భారతీయ అమెరికన్
భారతీయ అమెరికన్ బాలుడు కార్తిక్ నెమ్మని(14) స్పెల్లింగ్ బీ టైటిల్ గెలుచుకున్నాడు. శుక్రవారం జరిగిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ ఫైనల్ పోటీలో కోయ్నోనియా (అంటే క్రిస్టియన్ ఫెలోషిప్) అనే పదానికి సరైన స్పెల్లింగ్ చెప్పి విజేతగా నిలిచాడు. మరో భారతీయ అమెరికన్ విద్యార్థి నేసా మోదీ నుంచి అతనికి గట్టి పోటీ ఎదురైంది. మొత్తం 516 మంది స్పెల్లర్లు ఈ పోటీలో పాల్గొన్నారు. స్క్రిప్స్ బీ నుంచి ఒక ట్రోఫీ, రూ.26,84,580 మరియమ్ వెబ్స్టర్ నుంచి రూ.1,67,780 నగదు బహుమతులను కార్తిక్ గెలుచుకున్నాడు.













