జాన్సన్ అండ్ జాన్సన్ కీలక నిర్ణయం
బేబీ పౌడర్ అమ్మకాలను జాన్సన్ అండ్ జాన్సన్ నిలిపివేసింది. అమెరికా, కెనడా దేశాలలో తమ బేబీ పౌడర్ అమ్మకాలు నిలిపి వేయనున్నామని అమెరికా ఫార్మా దిగ్గజ సంస్థ అధికారికంగా ప్రకటించింది. వేలాది కేసులు, కోట్ల డాలర్ల పరిహారం లాంటి అంశాల నేపథంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఆరోగ్య సమస్యల ఆరోపణలు ఖండించిన సంస్థ ఉత్తర అమెరికాలో టాల్క్- ఆధారిత జాన్సన్ బేబీ పౌడర్ డిమాండ్ చాలావరకు తగ్గుతోందని ప్రకటించింది. వినియోగదారుల అలవాట్లలో మార్పులు, తప్పుడు సమాచారం, వ్యాజ్యాలు దీనికి ఆజ్యం పోసాయని జాన్సన్ అండ్ జాన్సన్ ఒక ప్రకటనలో తెలిపింది.













