నేను గెలిస్తే ఉచితంగా కరోనా వ్యాక్సిన్
తాను అధ్యక్షునిగా ఎన్నికయితే అమెరికావాసులు అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ హామీ ఇచ్చారు. సొంతరాష్ట్రం డెలవేర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఆరోగ్య బీమా ఉందా లేదా అన్న దానితో సంబంధం లేకుండా అందరికీ ఉచితంగా ఇస్తాం. అవసరమైన వ్యాక్సిన్ మొత్తాన్ని ఫెడరల్ ప్రభుత్వమే కొనుగోలు చేసి పంపిణీ చేస్తుంది అని తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ వద్ద ఎలాంటి ప్రణాళికలు లేకపోవడం వల్లనే దేశంలో కరోనా విజృంభించిందని ఆరోపించారు.













