తెలంగాణ అభివృద్ధిలో ప్రవాసులు పాలుపంచుకోవాలి
స్వాతంత్య్ర వచ్చాక అత్యధిక కాలం గాంధీ కుటుంబపాలనలో ఉన్న ఉత్తరప్రదేశ్ సాధించలేని సంపూర్ణ విద్యుదీకరణ, నాలుగేండ్ల స్వల్ప కాలంలోనే తెలంగాణలో సాధించామని, 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. అమెరికాలోని అట్లాంటాలో గౌతం గోలీ ఆధ్వర్యంతో తెలంగాణ ఎన్నారైలు ఏర్పాటు చేసిన కార్యక్రమాని ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని సాధించుకొని, 17 శాతం వృద్ధి రేటుతో దేశానికే ఆదర్శంగా ఎవరికీ అందనంత ఎత్తులో ఉండటానికి సీఎం కేసీఆర్ శ్రమిస్తున్నారని వివరించారు. అనంతరం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రవాసులు తెచ్చిన కేక్‌ను కట్‌చేసారు. అట్లాంటాలోని ప్రవాసులను కలిసి తెలంగాణ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చిన జగదీశ్‌రెడ్డికి గౌతం గోలీ ధన్యవాదాలు తెలిపారు.
దేశాన్ని పరిపాలించే స్థాయికి తెలంగాణ రాష్ట్ర నాయకత్వం చేరుకొన్నదని, దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వ పటిమే కారణమని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా నార్త్ కరోలినా రాష్ట్రంలోని రాలీ పట్టణంలో తెలంగాణ అసోసియేషన్ ఏర్పాటు చేసిన గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలంగాణను, కేసీఆర్ పాలనను రోల్ మోడల్‌గా చూపిస్తూ ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన తెలంగాణ, పాలనలోనూ ముందున్ననది తెలిపారు. ఈ కార్యక్రమంలో చిలుకల గోవర్ధన్, శ్రీకాంత్, అనిరుధ్ పున్నం, హరీశ్ కుందూరు, జలగం వెంగల్ తదితరులు పాల్గొన్నారు.













