సీఎం చంద్రబాబుకు ఐయోవా యూనివర్సిటీ ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఐయోవా యూనివర్సిటీలు సంయుక్తంగా అక్టోబర్లో నిర్వహించే వరల్డ్ పుడ్ ప్రయిజ్ సదస్సుకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఐయోవా యూనివర్సిటీ ఆహ్వానించింది. దేశ, ప్రపంచస్థాయి అత్యున్నత అధిపతులు మాత్రమే హాజరయ్యే ఈ వరల్డ్ పుడ్ ప్రయిజ్ సదస్సు అక్టోబర్ 18 నుంచి 21 వరకు డిమోయిస్లో జరగనుంది. అలాంటి సీఎం చంద్రబాబుకు ఆహ్వానం రావడం గర్వకారణంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అమెరికాలో వ్యవసాయ రంగ పరిశోధనల్లో విశేష కృషి చేస్తున్న ఐయోవా యూనివర్సిటీలో ఈ సదస్సు జరుగనుంది. ఈ నెల 7వ తేదీన ఐయోవా రాష్ట్ర రాజధాని డిమోయిన్లో ఐయోవా యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంవోసీ చేసుకుంది. దీంతో రానున్న ఆగస్టులో కర్నూలులో మెగా పుడ్ పార్కును ప్రారంభోత్సవం చేయనున్నారు. ఏది ఏమైనప్పటికి నాణ్యమైన విత్తనాలు, అధిక దిగుబడులతో రైతులను రాజును చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకల్పానికి ఈ ఆహ్వానంతో అడుగులు పడుతున్నాయని చెప్పుకోవచ్చు.













