భారతీయ విద్యార్థులు సురక్షితం
వరదల్లో చిక్కుకున్న యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్‌కు చెందిన 200 మంది భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. భారీ వరదల కారణంగా విద్యార్థులు ఉండే భవనాలు పూర్తిగా నీటితో నిండిపోయాయి. దీంతో వారు అపార్ట్మెంట్ పైకప్పు మీద ఉండిపోయారు. హ్యూస్టన్‌లోని భారత కాన్సులేట్ జనరల్ అనుపమ్ రాయ్ స్వయంగా అపార్టుమెంట్ వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ఫేస్బుక్ ద్వారా సమాచారం తెలుసుకున్న ఇండియన్ అమెరికన్ సంస్థలు వారికి భోజనం, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నాయి. దవాఖానలో చికిత్స పొందుతున్న ఏఅండ్ఎం యూనివర్సిటీకి చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు నిఖిల్ భాటియా, షాలినీల ఆరోగ్యపరిస్థితి విషమంగానే ఉంది. బ్రయాన్ సరస్సులో ఈతకు వెళ్లి వీరిద్దరూ ప్రమాదంలో చిక్కుకున్నారు. వారిని రక్షించిన పోలీసుల సెయింట్ జోసెఫ్ దవాఖానలో చేర్పించారు. హ్యూస్టన్‌లో లక్ష మంది భారతీయ అమెరికన్లు నివసిస్తున్నారు. వీరి నివాసాలు పూర్తిగా వరద జలలతో నిండిపోయాయి. కొంత మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లగా, మరికొందరు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.













