అమెరికాలో భారత పైలట్ అరెస్టు
భారత ఫైలట్ అమెరికాలో అరెస్టయ్యారు. పిల్లలకు సంబంధించిన అశ్లీల వీడియోలు ఫోన్లో డౌన్ లోడ్ చేసినందుకు భారతీయ పైలట్ ను ఎఫ్ బీఐ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు బయలుదేరి వెళ్లిన ఫైలట్ అక్కడ విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేయగానే ఎఫ్ బీఐ అధికారులు అరెస్ట్ చేసి విమానం నుంచి దించేశారు. అమెరికాలో చైల్డ్ పోర్న్ వీడియోలు చూడటం, డౌన్ లోడ్ చేయడం, షేర్ చేయడం నేరం. పైలట్ ను అరెస్టు చేసిన అమెరికా అధికారులు అతడి ఇంటర్నెట్ వాడకానికి సంబంధించిన రికార్డును భారత అధికారులకు పంపించారు.













