హార్వర్డ్ బిజినెస్ స్కూల్ 11 వ డీన్‌గా ఇండియన్
ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌కు అధిపతిగా భారతీయ సంతతికి చెందిన ప్రొఫెసర్ శ్రీకాంత్ దాతర్ ను నియమించినట్లు హార్వర్డ్ ప్రెసిడెంట్ లారీ బాకో తెలిపారు. శుక్రవారం అక్టోబర్ 9, 2020 హార్వర్డ్ గెజిట్ నివేదిక ప్రకారం ఆర్థర్ లోవెస్ డికిన్సన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ మరియు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (HBS) విశ్వవిద్యాలయ వ్యవహారాల సీనియర్ అసోసియేట్, భారతీయ సంతతికి చెందిన ప్రొఫెసర్ శ్రీకాంత్ దాతర్ జనవరి 1 2021 నుండి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ డీన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
హెచ్బిఎస్ యొక్క 112 సంవత్సరాల చరిత్రలో గత పది సంవత్సరాలుగా డీన్‌గా ఉన్న భారతీయ-అమెరికన్ నితిన్ నోహ్రియా స్థానం లో 11 వ డీన్‌గా ప్రొఫెసర్ దాతర్ బాధ్యతలు చేపట్టటం విశేషం.
1973 లో బొంబాయి విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ పట్టా పొందిన తరువాత ప్రొఫెసర్ దాతర్ అహ్మదాబాద్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి బిజినెస్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అందుకున్నారు. తరువాత స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ దాతర్ 1983 లో స్టాటిస్టిక్స్ , 1984 లో ఎకనామిక్స్ మరియు 1985 లో బిజినెస్ లో పిహెచ్.డి. పట్టా పొందారు.
1984 నుండి 1989 వరకు కార్నెగీ మెల్లన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఇండస్ట్రియల్ అడ్మినిస్ట్రేషన్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేసిన తర్వాత ప్రొఫెసర్ దాతర్ 1989 నుండి 1996 వరకు స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో పనిచేశారు. 1996 నుంచి దాదాపు 25 సంవత్సరాలుగా హార్వర్డ్‌లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ప్రొఫెసర్ శ్రీకాంత్ దాతర్ ఒక వినూత్న విద్యావేత్త, విశిష్ట పండితుడు మరియు లోతైన అనుభవజ్ఞుడైన విద్యా నాయకులు అని మరియు అధ్యాపకుల నియామకం , అధ్యాపకుల అభివృద్ధి లో, కార్యనిర్వాహక విద్య లో, పరిశోధన లో మరియు ప్రస్తుతం హార్వర్డ్ విశ్వవిద్యాలయ వ్యవహారాల లో సీనియర్ అసోసియేట్ డీన్ గా హార్వర్డ్‌లో ప్రొఫెసర్ శ్రీకాంత్ దాతర్ పలు కీలక పదవులు చైపట్టినట్టు హార్వర్డ్ ప్రెసిడెంట్ లారీ బాకో తెలిపారు.













