శ్వేతసౌధ ఫెలోగా భారత సంతతి వైద్యురాలు
అమెరికాలోని శ్వేతసౌధంలో 2023-24కు గాను ఉన్నతాధికారులతో కలిసి పని చేయడానికి ఫెలోషిప్ పొందిన 15 మందిలో భారత సంతతికి చెందిన కమల్ మెంఘ్ రజనీ కూడా ఉన్నారు. న్యూయార్క్‌కు చెందిన రజనీ మెమోరియల్ ష్లోయేన్ కెటరింగ్ క్యాన్సర్ కేంద్రం బోధనా సిబ్బందిలో సభ్యురాలు. లుకేమియా చికిత్సలో అమె నిష్ణాతులు. క్యాన్సర్ వ్యాధిని త్వరగా గుర్తించడం, నివారించడం గురించి పరిశోధనలు జరిపారు. క్యాన్సర్ నిర్ధారణకు కృత్రిమ మేధను ఉపయోగించడం, క్యాన్సర్ చికిత్స లభించనివారికి దాన్ని అందించడం వంటి కార్యక్రమాల కోసం అంకుర సంస్థలను స్థాపించారు.













