వైట్ హౌస్ ముందు ప్రవాస భారతీయులు గ్రీన్ కార్డ్ పోరాటం
గ్రీన్‌కార్డుల కోసం ప్రవాస భారతీయులు మరోమారు ఆందోళన బాటపట్టారు. వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్ ఎదురుగా సుమారు 1200 మంది నిరసన ప్రదర్శన చేశారు. తమకు వెంటనే గ్రీన్ కార్డులను ఇవ్వాలని నినదించారు. హెచ్ 1బీ వీసాపై అమెరికా వెళ్లిన భారతీయులకు గ్రీన్‌కార్డు వచ్చేందుకు వంద ఏండ్లకుపైగా పడుతున్నందున త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. అక్రమ మార్గాల్లో వచ్చిన వారి దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేస్తున్నారని, చట్టబద్దంగా వచ్చిన వారికి ఏండ్ల తరబడి సమయం పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే వారం జరిగే సరిహద్దు భద్రతా చర్చల్లో పదేండ్లకు పైగా అమెరికాలో నివాసముంటున్న వారికి తక్షణం గ్రీన్ కార్డు ఇచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. రిపబ్లికన్ హిందూ ఐక్య కూటమికి చెందిన యష్ బొద్దులూరి, కృష్ణ బన్సల్ ఈ ఆందోళనలకు సారథ్యం వహించారు.













