Space Needle Tower: స్పేస్ నీడిల్ టవర్‌పై భారతజాతీయ త్రివర్ణపతాక వెలుగులు…
సియాటిల్ (Seattle) లో నగర అందాలను వీక్షించడానికి నిర్మించిన 605 అడుగుల ప్రఖ్యాత స్పేస్ నీడిల్ టవర్ (Space Needle Tower) పై భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అమెరికాలోని ఈ ప్రముఖ ప్రాంతంలో విదేశీ జెండాను ఎగురవేయడం ఇదే తొలిసారి. భారత కాన్సుల్ జనరల్ ప్రకాశ్ గుప్తా, సియాటిల్ మేయర్ బ్రూస్ హారెల్, టిటిఎ నాయకులు వంశీరెడ్డి కంచరకుంట్ల మరికొందరు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘స్పేస్ నీడిల్‌పై భారత జాతీయ జెండా ఎగరడం మనకు లభించిన పెద్ద గౌరవమని పేర్కొంటూ ఎగురుతున్న త్రివర్ణ పతాకం వీడియోతో పాటు మరికొన్ని దృశ్యాలను గుప్తా ‘ఎక్స్’లో షేర్ చేశారు.







