స్వదేశానికి పంపేందుకు అమెరికాలో… భారతీయుడు అరెస్టు
బాలలపై లైంగిక నేరాలకు పాల్పడి శిక్షను అనుభవించి జైలు నుంచి విడుదలైన ఓ బారతీయుడిని అమెరికా పోలీసులు వెంటనే మళ్లీ అరెస్టు చేశారు. 32 ఏళ్ల వయసున్న అతడిని మార్చి 20న మేరీల్యాండ్ రాష్ట్రంలోని ఎలికాట్ సిటీలో అరెస్టు చేసినట్లు అమెరికా వలస వ్యవహారాల శాఖ తెలిపింది. ఆ వ్యక్తి 2019లో నాన్ ఇమిగ్రెంట్ వీసాపై అమెరికా వచ్చాడు. 2021లో ఖతర్‌లోని దోహాకు వెళ్లడానికి విమానం ఎక్కుతుండగా అధికారులు అరెస్టు చేశారు. ఒక మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణతోపాటు మరో రెండు లైంగిక హింస కేసులూ అతడిపై ఉన్నాయి. దీనికి దీర్ఘకాలిక జైలు శిక్షలు విధించిన కోర్టులు తరవాత వాటిని స్వల్పకాలానికి మార్చాయి. గత మార్చి 20న కారాగారం నుంచి విడుదలైన అతడిని భారత్‌కు తిప్పిపంపేయడానికి వీలుగా అమెరికా అధికారులు మళ్లీ అరెస్టు చేశారు.







