భారత సంతతి సిక్కు విద్యార్థికి ప్రతిష్ఠాత్మక విజయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ స్థాయి ఉపన్యాస, చర్చావేదిక పోటీలో భారత సంతతి విద్యార్థి జె.జె. కపూర్ విజయం సాధించారు. అమెరికాలో ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థులకు నిర్వహించే ప్రతిష్ఠాత్మకమైన నేషనల్ స్పీచ్ అండ్ డిబేట్ టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన ఈ సిక్కు అబ్బాయి సిక్కులు, ముస్లింల విషయంలో నెలకొని ఉన్న కొన్ని రకాల అభిప్రాయాలను నిష్కర్షగా పేర్కొన్నాడు. ముఖ్యంగా 9/11 దాడుల అనంతరం తమ కుటుంబంలో పరిస్థితి ఎలా ఉందో గుర్తుచేసుకున్నాడు. 2001లో సెప్టెంబరు 11వ తేదీన దాడులు జరిగినప్పుడు తన వయసు రెండేళ్లన్నాడు. ఆ తర్వాత తన తండ్రి గడ్డంతో, తలపాగాతో వెలుపలికి వెళ్లడానికే జంకేవారని జెజె.కపూర్ తన ఉపన్యాసంలో చెప్పాడు.













