వాయుసేన చీఫ్‌కు తప్పిన ముప్పు
భారత్ వైమానిక దళాధిపతి (ఐఏఎఫ్) ఎయిర్ మార్షల్ ఆర్.కె.ఎస్. బదౌరియాకు త్రుటీలో ప్రాణాపాయం తప్పింది. అమెరికాలోని పెర్ల్ హార్బర్లో ఓ సెయిలర్ జరిపిన కాల్పుల నుంచి ఆయన తప్పించుకున్నారు. ఈ ఘటనలో ఇద్దకు వ్యక్తులు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయానికి బదౌరియా బృందం అక్కడే ఉంది. కాల్పుల ప్రదేశానికి అదృష్టవశాత్తు కాస్త దూరంగా బదౌరియా బృందం ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటన అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకుని చనిపోయాడు. అతను ఎందుకీ దాడికి పాల్పడ్డాన్నది తెలియరాలేదు. పసిఫిక్ ఎయిర్ చీఫ్ సింపోజియం (పీఏసీఎస్-2019)లో భాగంగా బదౌరియా బృందం అక్కడికి వెళ్లింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన మైమానిక దళ చీఫ్‌లు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఈ ఘటన అనంతరం అధికారులు ఓ ప్రకటన చేస్తూ పీఏసీఎస్-2019 యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు.













