భారత్-అమెరిక రక్షణ వాణిజ్యం 25 బిలియన్ డాలర్లు : యూఎస్ కాన్సుల్ జనరల్
భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక రక్షణ వాణిజ్యం ఏటేటా గణనీయంగా పెరుగుతోందని, గత 15 సంవత్సఐరాల్లో అది ఏకంగా 25 బిలియన్ డాలర్లకు చేరిందని హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ తెలిపారు. యూఎస్ కాన్సులేట్, కట్స్ ఇంటర్నేషనల్ సంస్థ అమెరికా`భారత్ భద్రత, రక్షణ భాగస్వామ్యంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె ప్రసంగించారు. రెండు దేశాల మధ్య రక్షణ వాణిజ్యం 2008 వరకు దాదాపు శూన్యమని, ఆ తర్వాత రక్షణ రంగానికి సంబంధించి, మెరుగుపడిన సంబంధాల ఫలితంగా వాణిజ్యం భారీగా వృద్ధి చెందుతోందన్నారు. భారత్కు అమెరికా రక్షణ పరికరాల ప్రధాన సరఫరాదారుగా మారిందన్నారు. అమెరికాకు భారత్ అతిపెద్ద సైనిక భాగస్వామిగా ఉందని తెలిపారు. టైగర్ ట్రంప్ పేరిట 2019 నుంచి తూర్పు నౌక దళ కమాండ్ కేంద్రమైన విశాఖపట్నంలో రెండు దేశాలు కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు చేస్తున్నాయని, మళ్లీ మార్చిలో జరిగే కార్యక్రమం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
గత ఎనిమిది సంవత్సరాల్లో అమెరికా కంపెనీలు భారత్ పరిశ్రమలతో కలిసి ఏరోస్పేస్ పరిశ్రమలను ఈ దేశంలో నెలకొల్పాయన్నారు. అమెరికా-భారత్ సంబంధాలపై ఇప్పటికే కోల్కతా, జైపుర్, ముంబయిల్లో సదస్సులు నిర్వహించామని, వచ్చే నెలలో చెన్నైలో జరుగుతుందని వెల్లడిరచారు. ఐఐటీ తిరుపతి ప్రొఫెసర్ అనిల్ కపూర్, యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూటషన్ ఆఫ్ ఇండియా విభాగాధిపతి విశ్రాంత మేజర్ జనరల్ పవన్ ఆనంద్, సంస్థ ప్రతినిధి సరబ్జిత్ పర్మార్, తెలంగాణ ఏరోస్పేస్, డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మాజీ ఇంటెలిజెన్స్ అండ్ స్ట్రాటజిక్ అనలిస్ట్ హరీందర్ షేకాన్ తదితరులు మాట్లాడారు.













