వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారతే కీలకం : బిల్గేట్స్
కొవిడ్ మహమ్మారిని నియంత్రించే వ్యాక్సిన్ తయారీలో, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆ వ్యాక్సిన్ను పంపిణీ చేయడంలో భారత్ పాత్ర ఎంతో కీలకమని బిల్గేట్స్ అన్నారు. కరోనా మహమ్మారిని నిర్మూలించే వ్యాక్సిన్ తయారీలో 6 సంస్థలు ముందుండగా, వాటిలో కనీసం మూడు సంస్థల వ్యాక్సిన్లు వచ్చే మొదటి త్రైమాసికంలో అందుబాటులోకి వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక దాన్ని పెద్ద ఎత్తున తయారుచేసే బాధ్యతను అద్భుతంగా చేయగల దిగ్గజ సంస్థలు భారత్లోనే ఎక్కువగా ఉన్నాయన్నారు. అయితే ఆస్ట్రాజెనెకా, నోవా వాక్స్, జాన్సన్ అండ్ జాన్సన్.. ఇలా ఎవరు ముందుగా వ్యాక్సిన్ తయారుచేసినా దాన్ని భారత్లో తయారుచేసేలా చర్చలు జరుపుతున్నామన్నారు.













