అమెరికాలో భారతీయుడికి అరుదైన గౌరవం
భౌగోళిక పరిశోధనలు, మ్యాపింగ్, లోకేషన్ టెక్నాలజీల్లో భారత్ ఎన్నో నూతన పరిశోధనలు చేస్తోంది. అమెరికా అందజేసే మ్యాపులు కాకుండా స్వయంగా తమకంటూ ప్రత్యేకంగా ఓ మ్యాపింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసుకొంది. ఈ భౌగోళిక పరిశోధనలను గుర్తించిన అమెరికా చరిత్రాత్మక నిర్ణయం తీసుకొంది. అమెరికా భౌగోళిక విధానాలు, వాటి అమలు కోసం ఏర్పాటు చేసిన నేషనల్ జియోస్పేషియల్ అడ్వైజరీ కమిటీ (ఎన్జీఏసీ) లో ఓ భారతీయుడికి స్థానం కల్పించింది. ప్రపంచ భౌగోళిక పాలక మండలి కార్యదర్శిగా ఉన్న ఢిల్లీవాసి సంజయ్ కుమార్ ఈ ఘనత సాధించారు. ఈయన జియోస్పేషియల్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ సంస్థకు సీఈవోగా కూడా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఎన్జీఏసీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉన్న కేత్ మాస్బాక్ నేతృత్వంలో సంజయ్ సేవలందిచనున్నారు.













