మీ వల్ల కాదా? మేమే చేస్తాం
పాకిస్థాన్ విషయంలో ట్రంప్ సర్కారు స్వరం మరింత కఠినంగా మారింది. ఉగ్రవాద స్థావరాల్ని నాశనం చేయాల్సిందేనని సృష్టం చేసింది. చేతకాదంటే చెప్పాలని, ఎలా సాధించుకోవాలో తమకు తెలుసని వ్యాఖ్యనించింది. ఆమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ ఇటీవల పాక్ ప్రభుత్వ పెద్దలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడారు. మాక్కావాల్సిందేంటో పాకిస్థాన్‌కు చెప్పాం. ఇది చేయాలన్నాం. డిమాండేమీ లేదు. మీది సార్వభౌమ దేశం, ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి. మాకు ఏది ముఖ్యమనుకుంటున్నామో గ్రహించండి. మీరు అది చేయాలనుకోకపోతే ఫర్లేదు. ఇంకోరంగా సాధించుకొనేందుకు వీలుగా మా వ్యూహాలు మార్చుకుంటాం అన్నారు.













