వలసదారుల శిబిరాల్లో సోదాలు
అమెరికాలోని వలసదారుల శిబిరాలపై ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్న 680 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు. అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు, భద్రతా కారణాల దృష్ట్యా అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. అరెస్టయిన వలసదారులు తిరిగి వారి స్వదేశాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అక్రమ వలసదారులను మాత్రమే ఐసీఈ అధికారులు అరెస్ట్ చేశారని మిస్పిసిపీ అటార్నీ మైక్ హస్ట్ తెలిపారు. కాగా, అమెరికాలో అక్రమ వలసదారుల సంఖ్య పెరిగిపోయిందని జూన్ నెలలో ట్రంప్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అక్రమ వలసదారులను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక అధికారులను నియమించనున్నట్టు తెలిపారు.













