ఐఏఎన్టీ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ నార్గ్ టెక్సాస్ (ఐఏఎన్టీ) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్లానోలోని మినర్వా బాంకెట్ మాల్లో ఈ కార్యక్రమం జరిగింది. అతిథులందర్నీ ఆహ్వానించిన అనంతరం 11 మంది మహిళలు తమ సక్సెస్ స్టోరీలను పంచుకున్నారు. సమాజానికి చేసిన సేవ ఆధారంగా ఈ స్పీకర్లను ఎంపిక చేశారు. ప్రసంగాల అనంతరం 11 మందినీ ఐఏఎన్టీ సన్మానించింది. వన్ ఎర్త్ వన్ ఛాన్స్ (ఓఈఓసీ) తరఫున 760 మొక్కలు నాటడంతోపాటు మొక్కలను కాపాడేందుకు ఎంతో కృషి చేసిన గీతా మీనన్‌కు ఐఏఎన్టీ వుమెన్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డును అందించారు. అనంతరం ఐఏఎన్టీ ప్రెసిడెంట్ దినేష్ హుడా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ మరియు ఈవెంట్ ఛైర్మన్ సుష్మా మల్హోత్రా కలిసి బోర్డు మెంబర్లు, వాలంటీర్లు, స్పాన్సర్లు, అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు బోర్డు సభ్యులందరికీ ఐఎన్టీ ట్రస్టీ బోర్డు ఎమెరిటస్ షబ్నామ్ మోడ్గిల్, ఐఏఎన్టీ ట్రస్టీ బోర్డు చైర్మన్ ఇందూ రెడ్డి మందాడి కృతజ్ఞతలు తెలియజేశారు.













