అమెరికాలో తెలుగు భాష ప్రథమస్థానం : యూఎస్ కాన్సుల్ జనరల్
భారతదేశంలో ఐటీ రంగ అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని యూఎస్ కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్మాన్ పేర్కొన్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లో హైసా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఐజెడ్ సమ్మిట్-2020 ఎక్స్‌పాండింగ్ గ్రోత్ హారిజోన్స్ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారతలో ఐటీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో తెలుగు ప్రథమస్థానంలో ఉన్నదని చెప్పారు. అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించేందుకు ఆసక్తి చూపుతున్న విద్యార్థులకు వీసాలను అందజేస్తున్నట్టు తెలిపారు. అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న సంస్థలను ఆహ్వానిస్తున్నట్టు వివరించారు. ఇండియా, అమెరికాల మధ్య సత్స సంబంధాలను నెలకొల్పేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.
గ్రేహౌండ్ రీసెర్చ్ ఫౌండర్ అండ్ సీఈవో సంచిత్ వీర్ గోగీయా మాట్లాడుతూ అన్ని రంగాల్లో డిజిటల్ మాత్రమే భవిష్యత్ కాదని, అవకాశాల డిస్ట్రిబ్యూషన్ కీలక పాత్ర వహిస్తుందని చెప్పారు. ఇప్పటికే అన్ని సంస్థలు మల్టిపుల్ విజన్స్తో ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. ప్రతి దేశం ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుందని, దానికి అనుగుణంగా మార్కెట్‌ను సృష్టించుకుంటూ ముందుకుసాగాలని సూచించారు.













