అమెరికాలో ప్రమాదం.. హైదరాబాదీ దుర్మరణం
అమెరికాలోని నార్త్ కరోలినాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన అబ్బరాజు పృథ్వీ రాజ్ (30) మరణించారు. నార్త్ చార్లెట్ ప్రాంతంలో తన భార్య, స్నేహితులతో కలిసి గురువారం రాత్రి పృథ్వీ ప్రయాణిస్తున్న కారు మరో కారును డీకొట్టింది. ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే, పృథ్వీరాజ్ కారు దిగి పోలీసులకు ఫోన్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా మరో వాహనం ఆయనను ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. సంగారెడ్డికి చెందిన విశ్రాంత విద్యుత్ శాఖ ఉద్యోగి అబ్బరాజు వెంకటరామణ్ కుమారుడు పృథ్వీరాజ్. వీరి కుటుంబం హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో స్థిరపడిరది. ఎనిమిదేండ్లుగా అమెరికాలో ఉద్యోగం చేస్తున్న పృథ్వీరాజ్‌కి గత ఏడాది వివాహం జరిగింది.







