ఎవరెస్టు శిఖరంపై 5జీ నెట్వర్క్ స్థాపన
టిబెట్‌పై పట్టు నిలుపుకొనేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఎవరెస్ట్ శిఖరం ఫొటోలతో కూడిన ఓ ట్వీట్‌ను చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్వర్క్ (సీజీటీఎన్) ఇటీవలే ప్రచురించింది. అందులో చైనాకు చెందిన టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో ఎవరెస్టు శిఖరంపై అద్భుతమైన సూర్యకాంతి వలయం కనిపించింది అని పేర్కొంది. టిబెట్ స్వయం ప్రతిపత్తి ప్రాంతంలోని ఎవరెస్టు శిఖరం ఉత్తర భాగంలో చైనా 5జీ నెట్‌వర్క్‌ను నెలకొల్పిందని జవహర్లాల్ వర్సిటీకి చెందిన చైనా వ్యవహారాల నిపుణుడు కె.శ్రీకాంత్ తెలిపారు. ఈ నెట్‌వర్క్‌తో హిమాలయాలపై చైనా నిఘా వేసే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. అక్కడి నుంచి భారత్, బంగ్లాదేశ్, వయన్నార్లపైనా డ్రాగన్ దేశం గూఢచర్యం చేయొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.













