రష్యా ప్రమేయంపై సాక్ష్యాలున్నాయన్న ట్రంప్ సలహాదారు
అమెరికా అధ్యక్ష ఎన్నికల (2016)కు అంతరాయం కలిగించేందుకు రష్యా కుట్ర పన్నిందనడానికి సృష్టమైన సాక్ష్యాధారాలు వున్నాయని ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు హెచ్.ఆర్.మెక్మాస్టర్ తెలిపారు. ఈ సాక్ష్యాధారాలపై ఎలాంటి సందేహం లేదని చెప్పారు. ఇక్కడ జరుగుతున్న భద్రతా సమావేశంలో మెక్మాస్టర్ చేసిన ప్రకటన, తన విజయంలో రష్యా ప్రమేయం వుందనడం బూటకమని ట్రంప్ పదే పదే చెబుతున్నదానికి పూర్తి విరుద్ధంగా వుంది. ఎఫ్బిఐ అభిశంసనను పరిగణనలోకి తీసుకున్నట్లైతే ఈ సాక్ష్యాధారాలు సరైనవేనని రుజువవుతోందని అన్నారు. పైగా ప్రజలకు అందుబాటులో ఇంటర్నెట్లో వున్నాయన్నారు.













