ఒమేగా- 6 తో గుండెకు ముప్పు!
పెద్ద వయస్కులు కొవ్వు శాతం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే వారికి గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదం అధికమని తాజా అధ్యయనంలో గుర్తించారు. ఒమేగా- 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే కొవ్వు పదార్థాలు గుండెకు చెడు చేస్తాయని, మధుమేహానికి కారణమవుతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఒమేగా-6 ఎక్కువగా ఉండే ఆహారం ఆరోగ్యంపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగం చేశారు. ఊబకాయానికి కారణమయ్యే ఈ ఆహారం వలన ఎలుకల రక్తంలో నూట్రోఫిల్స్ నిష్పత్తి పెరిగిందని, దీని కారణం గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంటుందని చెప్పారు.













