తానా ట్రస్టీ బోర్డు చైర్మన్‌గా హరీశ్ కోయ
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ట్రస్టీ బోర్డు చైర్మన్‌గా హరీశ్ కోయ ఎంపికయ్యారు. కార్యదర్శిగా వెన్నం మురళి, కోశాధికారిగా ప్రభల జగదీష్‌ను ఎంపిక చేశారు. చైర్మన్‌గా ఎంపీకైన హరీశ్‌ను తానా అధ్యక్షుడు జయ్ తాళ్లూరి అభినందించారు. దాదాపు 40 వేల మంది అధికారిక సభ్యులున్న తానాలో ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఫౌండేషన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనే మూడు విభాగాలున్నాయి. ఎగ్జిక్యూటివ్ కమిటీకి అధ్యక్షుడు నేతృత్వం వహిస్తారు. ఈ సారి అధ్యక్ష పదవికి జయ్ తాళ్లూరి ఎంపికయ్యారు. ఇక ఫౌండేషన్ భారత్‌లో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, తానా విధానపరమైన అంశాలపై నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఫౌండేషన్ సభ్యులు కలిసి ట్రస్టీల బోర్డును ఎన్నుకుంటారు. ట్రస్టీల్లో ఒకరిని బోర్డు చైర్మన్‌గా ఎంపిక చేస్తారు.













