హెచ్ 1బీ పై ఉత్తర్వులు ?
అమెరికా నిర్ణయంతో ప్రభావితమయ్యేవారు, భారత్ టెక్కీలు అత్యధికంగా కలిగి ఉన్న హెచ్ 1బీ వీసాలపై అధ్యక్షుడు విడిగా ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉందని వైట్‌హౌస్ పాలనాయంత్రాంగం అధికారి చెప్పారు. ఈ వలసల నిషేధంలో కొన్ని మినహాయింపులు ఉంటాయని ట్రంప్ సృష్టం చేశారు. అయితే ఆ మినహాయింపులేమిటో ఆయన వివరించలేదు. అమెరికాకి పూర్తిగా వలసల్ని నిషేధించం. కొందరికి మినహాయింపులుంటాయ్. మానవత్వత అంశాలను కూడా ప్రాతిపదికగా తీసుకుంటాం అని ట్రంప్ చెప్పారు. కరోనా సంక్షోభ సమయంలో ఆహారం పంపిణీ చేసేవారికి మిహాయింపులిచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.













