జిడబ్ల్యుటీసిఎస్ వాలీబాల్, త్రోబాల్ పోటీలు విజయవంతం
బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (జిడబ్ల్యుటీసిఎస్) స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆగస్టు 11వ తేదీన వాలీబాల్ పోటీలను, త్రోబాల్ పోటీలను నిర్వహించారు. వర్జీనియా వాలీబాల్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ పోటీలకు పలువురు క్రీడాకారులు హాజరయ్యారు. పురుషుల, మహిళల వాలీబాల్ పోటీల్లో పలు టీమ్ లు పాల్గొన్నాయి. హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో విజేతలను ఎంపిక చేసి ట్రోపీని బహుకరించారు. వాలీబాల్ పోటీలకు ప్రైజ్ మనీగా 3000 డాలర్లను నిర్ణయించి విజేతలకు అందించారు.
ఉదయం 8 గంటలకు పోటీలు ప్రారంభమయ్యాయి. రాత్రి 9వరకు నిరంతరాయంగా జరిగాయి. ఎంతోమంది ఈ టోర్నమెంట్‌ను వీక్షించి ఆటగాళ్ళను ప్రోత్సహించారు. చివరకు విజేతలను ప్రకటించారు. పురుషుల వాలీబాల్ పోటీల్లో డివిజన్ 1 విజేతగా కంట్రీ ఓవెన్ యూత్, రన్నర్స్‌గా కంట్రీ ఓవెన్ లెగసీ నిలిచింది. డివిజన్ 2 విజేతగా చీతాస్, రన్నర్స్‌గా రఫ్ఆడిస్తాం నిలిచింది. ఉమెన్ వాలీబాల్ పోటీల్లో విజేతగా బ్లాక్ ఎన్ రోల్, రన్నర్స్‌గా నాన్ ప్రాఫిట్ వాలీబాల్ క్లబ్ నిలిచింది. ఉమెన్ త్రోబాల్ పోటీల్లో విజేతగా సన్ రైజెస్, రన్నర్స్‌గా ఛాలెంజర్స్ నిలిచింది.
స్పోర్ట్స్ కమిటీ సభ్యులు సురేంద్ర ఓంకారం, స్వరూప్ లింగ, అమర్ పశ్య, రాజేశ్ కాసరనేని తదితరులు ఈ పోటీల విజయవంతానికి కృషి చేశారు.
జిడబ్ల్యుటీసిఎస్ అధ్యక్షుడు కృష్ణ లాం, రవి అడుసుమిల్లి, సుశాంత్ మన్నె, భాను మాగులూరి, శ్రీవిద్య సోమ, పద్మజ బెవర ఈ పోటీలను పర్యవేక్షించి బహుమతులను అందించారు. తానా రీజినల్ వైస్ ప్రెసిడెంట్ సతీష్ చింత కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.







