జిడబ్ల్యుటీసిఎస్ కొత్త కార్యవర్గం
బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (జిడబ్ల్యుటీసిఎస్) కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 2023-24 సంవత్సరానికి కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినట్లు ఎన్నికల కమిటీ ప్రకటించింది. జనవరి 1, 2023 నుంచి డిసెంబర్ 31, 2024 వరకు ఈ కార్యవర్గం ఉంటుంది. ఈ ఎన్నికలను ఏకగ్రీవంగా జరిగేందుకు సహకరించిన అందరికీ ఎన్నికల కమిటీ సభ్యులు త్రిలోక్ కంతేటి, జయప్రద వల్లూరిపల్లి, ప్రభావతి పిప్పల్ల ధన్యవాదాలు తెలిపారు.
కొత్త కార్యవర్గం
కృష్ణలామ్ (ప్రెసిడెంట్)
రవి.సి. అడుసుమిల్లి (వైస్ ప్రెసిడెంట్-ఆర్గనైజేషన్)
సుష్మ అమృతలూరి (వైస్ ప్రెసిడెంట్-కల్చరల్)
శ్రీనివాసబాబు గంగ (వైస్ ప్రెసిడెంట్-యూత్)
సుశాంత్ మన్నె (సెక్రటరీ)
శ్రీవిద్య సోమ (సెక్రటరీ-కల్చరల్)
భాను మాగులూరి (ట్రెజరర్)
విజయ్ కుమార్ అట్లూరి (జాయింట్ ట్రెజరర్)
కార్తీక్ కోమటి (జాయింట్ సెక్రటరీ)
బోర్డ్ డైరెక్టర్లుగా ప్రవీణ్ కొండక, చంద్రకుమార్ మాలావతు, ఫణి సి. తాళ్ళూరి, రాజేశ్ కుమార్ కాసారనేని వ్యవహరించనున్నారు.













