పండుగలా జరిగిన తానా కవితాలహరి

ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహణలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ‘‘తానా కవితాలహరి’కి మంచి స్పందన వచ్చింది. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవం వేడుకలు పురస్కరించుకుని ఏప్రిల్ 22వ తేదీ నుండి ఏప్రిల్ 24 వరకు వరుసగా మూడు రోజులు పండగలాగా కార్యక్రమాలు జరిగాయి. ఈ సారస్వత ఉత్సవాల ముగింపు రోజున తానా ప్రస్తుత అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, పూర్వ అధ్యక్షులు తాళ్ళూరి జయ శేఖర్, ప్రెసిడెంట్ ఎలక్ట్ నిరంన్,తానా ప్రధాన కార్యదర్శి వేమూరి సతీష్ ప్రసంగించారు. సాహిత్య వేదిక అంతర్జాతీయ సమన్వయకర్త శ్రీనివాస్ సభాధ్యక్షత వహించారు.
వేదిక నిర్వాహకులు డాక్టర్ తోటకూర ప్రసాద్ పరోక్ష నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కవి సమ్మేళనంలో దేశవిదేశాల నుండి 75 మంది ఎంపిక చేశారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణాతో పాటు వివిధ ప్రాంతాల వారిని ఆహ్వానించామని నిర్వాహకులు ప్రకటించారు. కవితా రచన ప్రక్రియ సమాజ హితమే అభిమతంగా, సకలజనుల సంక్షేమమే ధ్యేయంగా కొనసాగాలని, వర్ధిల్లాలి అని తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి ఆకాంక్షించారు. సాంస్కృతిక వారసత్వం కాపాడటం, జాతిని జాగృతం చేయడంలో సాహితీవేత్తల పాత్ర ఎంతో ఉంటుందని తాళ్లూరి జయ శేఖర్ అన్నారు.
తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ నిరంజన్ మాట్లాడుతూ మన సాంస్కృతిక వారసత్వం అన్ని రచనల్లోనూ ప్రతిఫలించాలి, గతాన్ని గుర్తు చేస్తూ, భవిష్యత్తును సూచిస్తూ కవులు తమ రచనలు చేయాలని సలహా ఇచ్చారు. తెలుగు వికాసం కోసం మనస్ఫూర్తిగా కృషి చేస్తామని, తెలుగు భాషా సంస్కృతి సాంప్రదాయాల విస్తరణకు ఎక్కడ ఎవరు ముందుకొచ్చి సహకరిస్తామని వేమూరి సతీష్ తానా తరఫున తెలియజేశారు. ప్రత్యేక ఆహ్వానిథులుగా విచ్చేసిన తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం ఐ.ఏ.యస్ అత్యంత స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. మూడో రోజు ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మండపాటి శేషగిరిరావు ఉపన్యసించారు. వారు ఆయా రంగాల్లోని చేస్తున్న సేవా కార్యక్రమాలను విశదీకరించారు. గ్రంధాలయ సంస్థ రచయితలకు ఎలా ఉపయోగపడగలదో వివరించారు. విశిష్ట అతిథిగా సాంస్కృతిక బంధు సారిపల్లి కొండల రావు హాజరయ్యారు.
ఆంధ్ర ప్రదేశ్ విద్యా శాఖ అధికారి డాక్టర్ సుహాసిని, కళా వేదిక అధ్యక్షులు కత్తి మండ ప్రతాప్, అమెరికా వైద్యులు మహేష్ కుమార్ గారు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై ప్రసంగించారు. ముచ్చటగా మూడో రోజున ముగింపు సభలో కలిపే రాజ్ కుమార్, కొండ మోహన్, రామ రత్నమాల, డాక్టర్ యం.ఎన్. బృంద, డాక్టర్ ఒలేటి ఉమా సరస్వతి, నామాని సుజనాదేవి, నారాయణ డి.వి.వి.ఎస్, వి.పద్మావతి, డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్, మంజీత రాణి, దరిపల్లి స్వరూప గారు, రవీంద్ర నుటెంకి, సత్య పూర్ణిమ, ఇంజపురి వసంత, జె.వి. చెవూరి, మాడ్గుల ఆదినారాయణ శాస్త్రి, కంచం విజయ కుమారి, బి.వి.రాణి, ఎస్ వి రమేష్ కుమార్, జ్యోతి మువ్వల, పండ్రంగి శారద, శశిబాల ఇలా ఎందరెందరో కవితాలహరి ఒకటి రెండు మూడు రోజులు రచనా నిపుణతలు ఎగసెగసి ప్రపంచ సాహిత్య వేదిక ఎంతగానో అలరించాయి.
నిత్య నిరంతర ఝరి.. ’’తానా కవితాలహరి’’
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల తరుణంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహిస్తున్న అపురూప కార్యక్రమమిది. తానా ప్రస్తుత అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు గారి తొలి పలుకులలో సామాజిక అంశాలపై అవగాహనతో, ప్రజలలో చైతన్యం కలిగించేవిధంగా కవులు కవితా రచనలు చేయాలని చెబుతూ, తానా నిర్వహిస్తున్న కార్యక్రామాలు వివరించారు. తానా పూర్వాధ్యక్షులు శ్రీ తాళ్లూరి జయశేఖర్ గారు ఉత్సాహ ప్రోత్సాహక మాటలతో, కవుల కర్తవ్యాన్ని ఆయన గుర్తుచేస్తూ, కవితాత్మకంగా పూర్వ కవులను ఉటంకిస్తూ, అందమైన, అర్థవంతమైన ప్రసంగంతో అందరిలో స్పుర్తి నింపారు. బంకించంద్ర వందేమాతరం గీతాన్ని, గరిమెళ్ల సత్యనారాయణ మాకొద్దీ తెల్ల దొరతనము గుర్తు చేస్తూ కవులకు కర్తవ్య బోధ చేసారు.
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర పరోక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్విరామంగా జరిగింది. కవన భేరికి తొలి రోజు సభాధ్యక్షులు .తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్. విశ్వవ్యాప్తంగా 75 మందికి మించి కల, గళాలను జోడిస్తున్న ఈ మూడు రోజుల మహోత్సవాల శుభారంభ ప్రక్రియ ఆసాంతమూ ఎంతో చైతన్యభరితం. మొదటి రోజున ముఖ్యఅతిథి హైదరాబాద్ సన్ షైన్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ ఏ.వీ. గురవారెడ్డి, వైద్య ప్రముఖులైన ఆయన ప్రసంగంలోని ప్రతి వాక్యం సారస్వత అనురక్తిని చాటిచెప్పింది. భాష ,సాహిత్యం, సంస్కృతి, కళలు, ఇంకా మరెన్నింటినో రంగరించి కమనీయ, రమనీయ సందేశం అందించారు. భావాలు – అనుభవాలను రసరమ్యంగా మిళితం చేసిన ఆ వాగ్దాటి ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తన వినమ్రతకు ప్రతీక.
పోటీల్లో విజేతలుగా నిలిచి తమదైన ప్రత్యేకతను నిలబెట్టుకున్న కవి మిత్రులందరికీ ఎప్పుడు వైద్య సహాయం అవసరమైనా ముందుండి అందిస్తామని సభాముఖంగా ప్రకటించడం వారి విశాల హృదయానికి తార్కాణం. విశిష్ట అతిథిగా ఉపన్యసించిన అరుణ తేళ్ళ ఆంధ్రప్రదేశ్ మహిళాభ్యుదయ సమితి అధ్యక్షులుగా, నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం గౌరవాధ్యక్షురాలిగా ఉత్కంఠ వాతావరణం సృష్టించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను ఉదహరిస్తూ, సామాజిక కోణాలను విశ్లేషిస్తూ ఎందరిలోనో నవ్య ఆలోచనలు రేకెత్తించారు. కర్ణాటకలోని సార్వత్రిక విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధిపతి ఆచార్య ఎం.రామనాధం నాయుడు గారు ప్రత్యేక అతిథిగా ధారాప్రవాహ ధాటి చూపారు. భాషా సంబంధ ప్రస్తావనలు, చారిత్రక అంశాలు,వర్తమాన తీరుతెన్నుల విపులీకరణతో అందరి మదిలోనూ చెదరని ముద్ర వేశారు.
తానా అధికారిక యూట్యూబ్ ఛానల్‌తో పాటు ఫేస్ బుక్ ఛానల్లో బీయప్ టీవీ ద్వారా అమెరికా, యూరప్ దేశాల్లో ఈ కార్యక్రమమంతా ప్రత్యక్ష ప్రసారమైంది. ఈటీవీ భారత్, మన టీవీ, టీవీ ఆసియా తెలుగు, – ఇతర మాధ్యమాల్లోనూ శని ఆదివారాల్లో కూడా ప్రసారాలు ఏర్పాటయ్యాయి. ప్రతి ఒక్కరి కవితను అపార శ్రద్ధాసక్తులతో విని, దీటైన సమీక్ష చేసి, ఎప్పటికప్పుడు సూచనలు సలహాలతో అందరినీ ఆకట్టుకున్నారు చిగురుమళ్ళ. కలాలు విజృంభించాయి, గళాలు విస్తరించాయి. శ్రీయుతులు మురహర రావు ఉమాగంధి, గోపిశెట్టి శ్రీధర్, జడా సుబ్బారావు, జంధ్యాల శరత్ బాబు, యస్.రత్నలక్ష్మి, కె.వీణారెడ్డి, రమాదేవి కులకర్ణి, నీరజా దేవి గుడి , శ్రీధర్ రెడ్డి బిల్లా, జయశ్రీ అన్నమరాజు, ఎంవీఎల్ఎస్ సరస్వతి, సింహాద్రి శ్రీనివాసరావు, ఉమా మహేశ్వరి యాళ్ళ, పత్తెం వసంత, పోచిరాజు వెంకట పద్మజ, అనిల్ కొమ్మినేని, అంజలి, పోచం సుజాత, మోటూరి నారాయణరావు, నల్లబాటి రాఘవేంద్రరావు, ఆకుల రఘురామయ్య, కుప్పలి వెంకట రాజారావు, వాల్మీకి శ్రీనివాసులు, పానుగంటి శ్రీనివాస్ రెడ్డి,కె.యల్.కామేశ్వరరావు, మారం రెడ్డి గోపాల్ రెడ్డి, చంద్రకళ దీకొండ, బందకవి శ్రీనివాస రామారావు… ఎందరెందరో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, హరియాణాలతో పాటు అమెరికా, మస్కట్, మరెన్నో ప్రదేశాల నుంచి కవి వాణి వినిపించారు.
రెండవ రోజు…
తొలిరోజు నవోత్సవం, రెండోనాడు మహోత్సాహం. తానా ప్రపంచ సాహిత్య వేదిక మరింత నిండుదనం సంతరించుకొంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం సేవా పతాక ఉవ్వెత్తున ఎగసింది. మూడు రోజుల కవితాలహరిలో భాగంగా 2వ రోజు రాత్రి సైతం కవుల, కవయిత్రుల కలాలూ, గళాలూ పోటీ పడ్డాయి. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు ఆత్మీయంగా ప్రతివారినీ పేరుపేరునా పలకరించారు. తానా తెలుగు వారి కోసం చేస్తున్న కృషి మరీ ముఖ్యంగా భాషా సాహిత్యాలకు చేస్తున్న సేవలు వివరించారు. తానా పూర్వాధ్యక్షులు జయ శేఖర్ తాళ్ళూరి మాట్లాడుతూ ప్రపంచంలోని తెలుగు భాషా ప్రియులను ఒక చోటికి చేర్చటం కోసం రెండేళ్ళ క్రితం మేము ఈ ప్రపంచ సాహిత్య వేదిక ఏర్పాటుచేయడం జరిగింది. ఇప్పుడు ఆ వేదిక అంజయ్య గారి ఆధ్వర్యంలో మరిన్ని గొప్ప కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉంది అన్నారు. తానా సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర శుభాకాంక్షలున్నాయంటూ అందరికీ ఘనస్వాగతం పలుకుతూ సందేశం అందించారు.
సభాధ్యక్షత వహించిన తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ ఈ సువిశాల కవి గోష్ఠి ఎన్నెన్నో అంశాలను మన ముందు నిలుపుతుందన్నారు. తెలంగాణా బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ముఖ్య అథితిగా విచ్చేసి సారస్వత ప్రాధాన్యాన్ని ఎంత విపులీకరించారో వినితీరాలి మరి. ఆయన సామాజిక కోణాలన్నింటినీ స్పర్శించారు. ముందురోజు మాదిరే ఇప్పుడూ 27 మందీ వినిపించేవీ భారతీయ సమగ్రతకు నిలువుటద్దం పట్టాలన్నారు. అమెరికా నుంచి విఖ్యాత కవి, విమర్శకులు డాక్టర్ అఫ్సర్ కవి విశిష్ట అతిథిగా చేసిన ప్రసంగం విస్తృత దృక్పథాన్ని విశదీకరించింది. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ చిత్రవాణి విభాగ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి ప్రత్యేక అతిథిగా ఉత్తేజపూరిత ఉపన్యాసమిచ్చారు. లుగు దశాబ్దాల సుదీర్ఘ సాహితీ చరిత్ర ప్రసంగంలో పరిమళిం చింది.ప్రత్యేక ఆహ్వానితులు, సంగీతకళానిధి కె.బి. శర్మ దేశభక్తి గానాలాపనతో సదస్సు వాతావరణ మంతా ఎంతగానో గుబాళి ంచింది. మరో ప్రత్యేక ఆహ్వానితులు లంకా లక్ష్మీనారాయణ (యువ కళా వాహిని అధ్యక్షులు)… రచనా వ్యాసంగం ఏ పరిస్థితుల్లో వెల్లివిరుస్తుందో ఉదాహరణ సహితంగా వివరించారు.
డాక్టర్ మురహరిరావు ఉమాగాంధీ, వెంకటేష్ కిలారు, శిరీష ఊటూరి, తుమ్మల కల్పనా రెడ్డి, కుమ్మరి బిక్షపతి, గురజాపు శ్రీరామకృష్ణ, పసుపులేటి నాగమల్లిక, శిరశినహల్ శ్రీనివాసమూర్తి, దాకరపు బాబూరావు, కె.ఎల్.సరోజరెడ్డి, కోరాడ అప్పలరాజు, వెంకు సనాతని, పి.వి.వి.ఎన్. రాజకుమారి, వెలిదండి సుమలత, అవ్వారి ఉమాభార్గవి, బండారి సుజాత, గుండాల రాకేష్, అరుణ పెనుమంట్ర, బండిరాజుల శంకర్, మొహమ్మద్ అఫ్సర వలీషా, గాడేపల్లి మల్లికార్జునుడు, సాలిపల్లి మంగామణి, కల్వల రాజశేఖర రెడ్డి, పెద్ది భరత్, శిష్టు సత్యరాజేష్, సామల శశిధర్ రెడ్డి, పోకూరి చంద్రశేఖర్, యనమదల శ్రీదేవి – కవితా పఠనాల పరంపర పలు భావానుభవాల మాలికగా నిలిచింది. వారి విభిన్న ఇతివృత్తాలతో, విశేష అభివ్యక్తీకరణలతో సాహితీ వేదిక తన పేరు ఇంకెంతో చరితార్థం చేసుకుంది. వ్యక్తులకు కాక, కవితా శక్తియుక్తులకే అత్యధిక ప్రాధాన్యమిచ్చిన ‘తానా’ అన్ని విధాలా.. ‘‘ఉత్సాహప్రోత్సాహాల ఖజానా’’ అంటూ ధన్యవాదలందించారు.











































































