“గోవిందా రక్షమాం కరోనాతః” ప్రపంచ ప్రార్థన
అన్నమాచార్య భావన వాహిని, (భారత్) మరియు నార్త్ అమెరికా తెలుగు సంఘం, (యు.యస్.ఎ) సంయుక్తంగా మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడి గారి ప్రేరణతో చేస్తూన్న సత్ప్రయత్నమిది. ఒకరు ప్రార్థించడం కన్నా సమిష్టిగా మనమంతా కలిసి ప్రార్థించినపుడు ఆ ప్రార్థనకు బలమెక్కవ. కరోనా ఏ ఒక్కరినో, ఏ ఒక్క దేశాన్నో బాధించడం లేదు. యావత్ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి. ప్రపంచంలోని మనుషులందరూ కలిసి చేసిన సమిష్టి కర్మ ఫలం ఈ కరోనా.ఈ భయంకర పరిస్థితిని సమిష్టి ప్రార్థనతోనే అధిగమించిగలం.
మే 9వ తేదీన భారత కాలమాన ప్రకారం రాత్రి 7.30 గం.లకు మనమంతా కలసి ముక్త కంఠంతో, ఒకే భావంతో, “గోవిందా రక్షమాం కరోనాతః” అంటూ పద్మశ్రీ అవార్డు గ్రహీత డా శోభా రాజు గారు రచించి, సంగీతం సమకూర్చిన ఈ ప్రార్థనా గీతాన్ని భక్తితో పాడుదాం. భగవంతుడి అనుగ్రహంతో ఈ భయంకర కరోనా నుండి విముక్తి పొందుదాం.
విజయేస్తు. శుభం.
ఈ గీతం యెక్క YouTube link వివరాలు:
“గోవిందా రక్షమాం కరోనాతః”
World prayer
May 09, 7.30pm IST
దివ్య ప్రేమతో,
అన్నమాచార్య భావన వాహిని, (భారత్) మరియు నార్త్ అమెరికా తెలుగు సంఘం, (యు.యస్.ఎ)













