ఇండియాలో 10 బిలియన్ల డాలర్ల పెట్టుబడి : సుందర్ పిచాయ్
గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో గ్లోబల్ ఫిన్‌టెక్ ఆపరేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. వాషింగ్టన్లో ప్రధాని మోదీతో చర్చలు తర్వాత ఆయన ఈ విషయాన్ని తెలిపారు. తమ కంపెనీ ద్వారా ఇండియాలో డిజిటైజేషన్ ఫండ్ కింద సుమారు 10 బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇండియాలో ఫిన్‌టెక్ నాయకత్వానికి తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. యూపీఐ, ఆధార్ వంటి సేవల్ని మరింత విస్తరించనున్నట్లు వెల్లడిరచారు. డిజిటల్ ఇండియా విజన్‌ను మరింత విస్తరించేందుకు తాము ప్రయత్నించనున్నట్లు పిచాయ్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పనిచేస్తున్న కంపెనీలకు ఊతం ఇవ్వనున్నట్లు తెలిపారు. భారతీయ భాషల్లోకి బాట్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.













