1969 తర్వాత మళ్లీ ఇప్పుడే…
గత కొన్ని దశాబ్దాల్లో అమెరికాలో కనీవినీ ఎరుగని రీతిలో ఇప్పుడు నిరసనలు ఎగిసిపడుతున్నాయి. 1968లో మార్టిన్ లూథర్ కింగ్ (జూనియర్) హత్యకు గురయ్యాక పెద్ద ఎత్తున పౌర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత దేశం నలుమాలలా అంతటి ఆందోళన వ్యక్తం కావడం మళ్లీ ఇప్పుడే. పోలీసుల హింస కారణంగా మే 25న ఫ్లాయిడ్ చనిపోయిన తర్వాత మిన్నెసోటాలోని మినియాపొలిస్‌లో చిన్నస్థాయిలో మొదలైన ఆందోళనలు క్రమేపీ అమెరికా అంతటా కార్చిచ్చులా వ్యాపించాయి. బోస్టన్‌లో పోలీసు వాహవానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఫిలడెల్ఫియాలో ఆందోళనకారులను, దుకాణాలను కొల్లగొడుతున్నవారిని చెదరగొట్టేందుకు సాయుధ పోలీసులు పెప్పర్ స్ప్రే ఉపయోగించారు. అనేక ప్రాంతాల్లో లాఠీ ఛార్జి జరిగింది. న్యూయార్క్‌లో కదంతొక్కిన ఆందోళన కారుల కారణంగా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కొన్నిచోట్ల భవనాలకు నిప్పు పెట్టడంతో భీతావహ వాతావరణం నెలకొంది.













