19 ఏండ్ల యువకుడే హ్యాకింగ్ సూత్రధారి
అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామాతో పాటు బిల్ గేట్స్, ఎలాన్ మాస్క్ తదితర ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖుల ట్విటర్ ఖాతాలను హ్యాకింగ్ చేసిన కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ హ్యాకింగ్ ప్రధాన సూత్రధారి గ్రాహమ్ ఇవాన్ క్లార్క్ అనే 19 ఏండ్ల యువకుడు కావడం విశేషం. మిగతా ఇద్దరు కూడా 23 ఏండ్ల లోపు వారే. జూలై 15న వీరు హ్యాక్ చేశారు. సమాజ సేవ కోసం విరాళాలు ఇవ్వాల్సిందిగా ప్రముఖులు పిలిపునిచ్చినట్టు ట్వీట్లు పెట్టారు. తాము చెప్పిన బిట్ కాయిన్ అడ్రస్‌కు డబ్బు పంపితే రెట్టింపు డబ్బు చెల్లిస్తామన్నారు. హ్యాకింగ్ విషయాన్ని వెంటనే గుర్తించిన ట్విటర్ ఖాతాదారులను అప్రమత్తం చేసింది.













