ఏఎంఏ బోర్టు ట్రస్టీగా బాబీ ముక్కామల
అమెరికా మెడికల్ అసోసియేషన్ (ఏఎంఏ) బోర్డు ట్రస్టీగా తెలుగువాడైన డాక్టర్ ఎస్.బాబీ ముక్కామల ఎంపికయ్యారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఏఎంఏ ట్రస్టీగా ఒక భారీయుడు ఎంపిక కావటం ఇదే తొలిసారి. మిచిగాన్ రాష్ట్రంలోని ప్లింట్లో ఆయన ఓటోలిరెంటాలజీగా (తలకు సంబంధించిన నిర్మాణంలో లోపాలను సరి చేసే విభాగం) ప్రాక్టీసు చేస్తున్నారు. 2008లో అమెరికన్ మెడికల్ అసోసియేషన్ బాబీకి లీడర్షిప్ అవార్డును అందించింది. చిన్న వయస్సులోనే ఆయన ఏఎంఏ యంగ్ ఫిజీషియన్ సెక్షన్‌కు మిచిగాన్ రాష్ట్రం నుంచి ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో పేరుమోపిన విద్యాసంస్థ ఎన్నారై మెడికల్ కాలేజీ అధిపతి ఎం.అప్పారావు కుమారుడైన బాబీ చిన్నప్పటి నుంచి అమెరికాలోనే పెరిగారు. మిచిగాన్ యూనివర్సిటీలోని మెడికల్ స్కూల్ నుంచి డిగ్రీ పట్టా పొందిన ఆయన సామాజిక సేవలోనూ చురుకుగా పాల్గొంటున్నారు.













