అమెరికా ఎఫ్‌డిఎ గ్రీన్ సిగ్నల్
అమెరికాలో కొవిడ్- 19తో చేరిన రోగులందరికీ వైద్య చికిత్సలో రెమ్‌డెసివిర్ మందును వినియోగించడానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డిఎ) అనుమతించిందని గిలీడ్ సైన్సెస్ ప్రకటించింది. ఇప్పటివరకు కరోనా తీవ్ర లక్షణాలున్న వారికే ఈ డ్రగ్‌ను పరిమితంగా వాడుతున్నారు. వివిధ స్థాయిలో కరోనా లక్షణాలున్న వారిపై సాగించిన పరిశోధనలు సంతృప్తికరంగా ఉండడంతో ఎఫ్‌డిఎ ఈ డ్రగ్ వాడకానికి అనుమతించింది. మోతాదు (మోడెరేట్) లక్షణాలు ఉన్న వారికి రెమ్‌డెసివిర్ ఇవ్వగా, 65 శాతం మంది ఐదు రోజుల్లో కోలుకున్నట్టు అధ్యయనంలో తేలిందని గిలీడ్ వివరించింది. ఇదివరకు రెమ్‌డెసివిర్‌ను ఆస్పత్రి లోని తీవ్ర లక్షణాలున్న కరోనా రోగులకు నాలుగు రోజులే వినియోగించేవారు. భారత్‌లో ఈ ఔషధాన్ని వినియోగించడానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డిసిజిఐ) ఇదివరకే అనుమతించింది.













