ఆత్మహత్యలకు ముక్కు స్ప్రేతో చెక్!
ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలను తుడిచిపెట్టేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ అభివృద్ధి చేసిన ముక్కు స్ప్రే స్ప్రవటోకు అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) ఆమోదం లభించింది. స్ప్రవటో 24 గంటల్లోనే సత్ఫలితాలను ఇస్తోందని జాన్సన్ అండ్ జాన్సన్ వైస్ ప్రెసిడెంట్ (అమెరికా) మిచెల్లీ క్రేమర్ వెల్లడించారు. ముక్కు స్ప్రే దీన్ని ద్వారా తీసుకోగానే మెదడులోని అత్యంత వేగవంతమైన సిగ్నలింగ్ వ్యవస్థ గ్లూటమేట్పై ప్రభావం చూపడతంతో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలను తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.













