కారుచౌకగా ఫేస్బుక్ ఖాతాదారుల డేటా!
దాదాపు 26.7 కోట్ల మందికి పైగా ఫేస్బుక్ వినియోగదారులకు సంబంధించిన సమాచారాన్ని హాకర్లు కారు చౌకగా మొత్తం రూ.41,500 (500 యూరోల)కు అమ్మేసిన విషయం సంచలనం సృష్టిస్తోంది. అయితే ఫేస్బుక్ ఖాతాదారులకు సంబంధించిన పాస్ వర్డ్లేవీ హాకర్ల చేతిలోకి వెళ్లలేదని సైబర్ రిస్క్ అసెస్మెంట్ సంస్థ సైబుల్ చెబుతోంది. ఫేస్బుక్కు చెందిన 26.7 కోట్ల మంది వినియోగదారులకు చెందిన ఇ-మెయిల్ చిరునామాలు, పేర్లు, ఫేస్బుక్ ఐడిలు, పుట్టిన రోజు వివరాలు, ఫోన్ నెంబర్ల వంటి వ్యక్తిగత సమాచారాన్ని హాకర్లు విక్రయించినట్లు ఈ సంస్థ వెల్లడించింది.













