ఫేస్బుక్ కీలక నిర్ణయం
చైనా టెలికాం దిగ్గజం హువావేకు మరో ఎదురు దెబ్బ తగిలింది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. హువావే కొత్త ఫోన్లలో ఫేస్బుక్ సహా, తమ యాప్లు వాట్సాప్, ఇన్స్ట్రామ్ ప్రీ-ఇన్స్టాల్గా లభించవని ప్రకటించింది. మార్కెట్లోకి రానున్న హువావే స్మార్ట్ఫోన్ కొనుగోలుదారుల వీటిని తప్పక డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. అయితే ఇప్పటికే హువావే ఫోన్లు వినియోగిస్తున్న వారికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్ని అప్డేట్స్ ఇస్తామని ఫేస్బుక్ తెలిపింది. ఫేస్బుక్ నిర్ణయంపై ట్విటర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే తాజా పరిణామంపై స్పందించేందుకు హువావే నిరాకరించింది.













