ఫేస్బుక్ మరో భారీ డిల్
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ప్లాట్‌ఫాంలో వాటా కొనుగోలుతో వార్తల్లో నిలిచిన ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరో ప్రముఖ వెబ్‌సైట్‌ను తన సొంతం చేసుకోనుంది. యానిమేటెడ్ ఇమేజెస్ లేదా జిఫ్‌లు రూపొందించే పాపులర్ వెబ్సైట్ జిఫీని కొనుగోలు చేస్తున్నామని ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. వేగంగా అభివృద్ధిచెందుతున్న ఇన్స్టాగ్రామ్ పోటో షేరింగ్ యాప్‌తో దీన్ని అనుసంధానం చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ డీల్ వివరాలు అధికారికంగ వెల్లడి కానప్పటికీ, దీని విలువ సుమారు 400 మిలియన్ డాలర్లు (సుమారు రూ.3,035 కోటు).
ఫేస్బుక్ యాజమాన్యంలోని ఫోటో షేరింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంటర్నెట్లో అత్యంత ప్రాచుర్యం జిఫీ భాగం అవుతుంది. ఇకపై జిఐఎఫ్ లైబ్రరీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ యాజమాన్యంలోని ఇతర యాప్‌లలో విలీనం కానుంది. ట్విటర్, స్నాప్‌చాట్, బైట్ డాన్స్ టిక్‌టాక్ వంటి సామాజిక వేదికలతో గిఫీ ప్రస్తుత అనుసంధానాలు మారవు అని ఫేస్బుక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎప్పటిలాగే వైడర్ ఎకోసిస్టంలో జిపీ అందుబాటులో వుంటుందని జిఫి కూడా ప్రకటించింది. తాజా భాగస్వామ్యంతో గొప్ప కంటెంట్‌ను సృష్టించగలుగుతామని ఇన్స్టాగ్రామ్ ఉత్పత్తి ఉపాధ్యక్షుడు విశాల్ షా అన్నారు.













