ఆన్లైన్లో కి ఫేస్బుక్ షాప్స్
సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ కొత్తగా ఫేస్బుక్ షాప్స్ను తీసుకురానుంది. ఈ సదుపాయం ద్వారా చిరు వ్యాపారులు కూడా తమ ఉత్పత్తులను ఆన్లైన్లో ప్రదర్శించుకోవచ్చు. అమ్ముకోవచ్చని ఫేస్బుక్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ సంస్థ పరిమిత కొనుగోలు అవకాశాలు తీసుకువచ్చిందని తాజా నిర్ణయంతో వ్యాపార ప్రకటనల ఆదాయం మరింత పెరుగుతుందని వార్తా సంస్థ రాయిటర్స్ తన కథనంలో పేర్కొది. ఫేస్బుక్ షాప్స్ అనేవి వ్యాపారులకు ఒక ఆన్లైన్ ప్లాట్‌ఫాంను ఇస్తాయని, ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల ద్వారా అందులో తమ ఉత్పత్తులను విక్రయానికి ఉంచవచ్చని, వారికి ఇష్టమైన విధంగా బ్రాండ్‌ను ప్రచారం చేసుకోవడానికీ (కస్టమైజ్) వీలుంటుందని ఫేస్బుక్ తెలిపింది. ఫేస్బుక్ పేజీ లేదా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ద్వారా వినియోగదార్లు ఫేస్బుక్ షాప్స్ను కనుగోని ఆర్డర్ పెట్టుకోవచ్చు.













