ఫ్లాయిడ్ మృతి కేసు.. బెయిల్ కు 10 లక్షల డాలర్ల పూచీకత్తు
నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతికి కారకుడైన పోలీసు డెరెక్ చౌవిన్ బెయిల్ మంజూరు కోసం 10 లక్షల డాలర్ల పూచీకత్తు ఇవ్వాలని మినియాపొలీస్ కోర్టు నిర్ధారించింది. షరతులకు లోబడి నడుచుకోవల్సి ఉంటుందని పేర్కొంది. షరతుల్లేకుండా అయితే 1.25 మిలియన్ డాలర్ల పూచీకత్తు ఇవ్వాలని కోర్టు పేర్కొంది. డెరిక్పై సెకండ్ డిగ్రీ మర్డర్, థర్డ్ డిగ్రీ మర్డర్, మ్యాన్ స్లాటర్ అభియోగాలు మోపారు. తన ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించాలని, ఓ పోలీస్ శాఖలోనూ పని చేయరాదని, దేశం విడిచి వెళ్లరాదని, జార్జి కుటుంబంతో కాంటాక్ట్ పెట్టుకోరాదని షరతులు విధించారు. ఆరెంజ్ ప్రిజన్ సూట్లో కోర్టుకు హాజరైన డెరెక్.. న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు సదురు, బెదురూ లేకుండా సమాధానాలిచ్చాడు. ఇతడిని నేరానికి ప్రోత్సహించిన మరో ముగ్గురు పోలీసులను కూడా అరెస్టు చేసి జైలుకు తరలించారు. తదుపరి విచారణ జూన్ 29కి వాయిదా వేసింది.













