ముందస్తు ఓటింగ్ లో ఇదో రికార్డు ….
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ దఫా ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు. ఇప్పటివరకు దాదాపు 5.87 కోట్ల మంది ఎర్లీ బ్యాలెట్ ద్వారా ఓటు వేసినట్లు గణాంకాలు వెల్లడించాయి. 2016 ఎన్నికలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఎర్లీ బ్యాలెట్లు ఎక్కువగా ఉంటే కౌంటింగ్ ఆలస్యమయి, రిజల్టు లేటవుతుంటుంది. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఎర్లీ బాలెట్లు కూడా పెరిగాయని సీఎన్ఎన్ నివేదిక తెలిపింది. కరోనా సంక్షోభంతో ఎక్కువ మంది ఓటింగ్ కేంద్రాలకు వెళ్లకుండా ఉండేందుకు మొగ్గు చూపుతున్నారని తెలిపింది. అమెరికాలో సుమారు 24 కోట్ల మంది ఓటర్లు ఈ దఫా ఓటు హక్కు ఉపయోగించుకుంటారని యూఎస్ఏ టుడే తెలిపింది. ఇప్పటివరకు ఎర్లీ ఓటు ఉపయోగించుకున్న వారిలో డెమొక్రాట్ మద్దతుదారులు అధికమని (70 శాతం) నివేదిక తెలిపింది.













