న్యూయార్క్ లో క్యాబ్ డ్రైవర్ అమానుషం
న్యూయార్క్ లో ఓ క్యాబ్ డ్రైవర్ అమానుషత్వం ఓ అబల ప్రాణాలు బలిగొంది. శుక్రవారం ఉదయం అహ్మద్(23) అనే డ్రైవర్ మహిళాను క్యాబ్ లో తీసుకెళ్త్ను సమయంలో ఫ్లైఓవర్ డివైడర్ ను ఢీ కొట్టారు. వెంటనే కారులో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో ప్రయాణికురాలు హర్లీల్ గ్రేవాల్ (25)అనే మహిళను కారులోనే వదిలి బయటకు దూకేశాడు. ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత కూడా మంటల్లో చిక్కుకున్న మహిళలను కాపాడేందుకు ప్రయత్నించకుండా ఆస్పత్రికి వెళ్లిపోయాడు. డ్రైవర్ అమానుశత్వంతో సదరు మహిళ కారులోని కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం కారు మంటలను అర్పివేసే సమయానికే మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.













