డొనాల్డ్ ట్రంప్ కు చేదు అనుభవం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఏ వార్త బయటికి వచ్చినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే తాజాగా ట్రంప్ మిన్నియా పోలీస్ సెయింట్ పాల్ అంతర్జాతీయ విమానాశ్రమంలో విమానం ఎక్కుతున్నప్పుడు ఆయన ఏడమ కాలి బూటుకు టాయిలెట్ పేపర్ లాంటిది ఏదో అతుకుంది. విమానం మెట్లు ఎక్కుతున్నప్పుడు అది సృష్టంగా కనిపించింది. దాంతో అక్కడి ఫొటోగ్రాపర్లు దాన్ని వీడియో తీశారు. అయితే విమానం మొట్లు పూర్తిగా ఎక్కేలోగానే అది పడిపోయింది. కాలికి ఏదో అతుకున్నా ట్రంప్ దాన్ని గమనించకపోవడం విశేషం. కానీ ఇప్పడు అది నెటిజన్లకు ఓ సంచలన వార్త అయింది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు కూడా చేస్తున్నారు. చెత్త మరో చెత్తుకు అంటుకుంది అని ఓకరు వ్యాఖ్యానిస్తే, ఇది మ్యూజిక్‌తో కూడిన ట్రంప్ పేపర్ వాక్ అంటూ మరొకరు వ్యాఖ్యానించారు.













