డొనాల్డ్ ట్రంప్ కు షాక్
విదేశీయులకు గ్రీన్‌కార్డుల జారీలో దేశాలకు కోటా విధించాలన్న ట్రంప్ ప్రతిపాదనకు సెనెట్‌లో చుక్కెదురైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన నూతన ఇమ్మిగ్రేషన్ బిల్లుకు ఎగువసభలో సవరణలను ప్రతిపాదించారు. విదేశీయులు అమెరికాలో ఉద్యోగం చేయాలంటే అత్యంత అనుభవం ఉన్న నిపుణులను, మెరిట్ ఆధారంగా మాత్రమే అనుమతించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రీన్‌కార్డుల జారీలోనూ దేశాలకు కోటా విధించాలని ప్రతిపాదిస్తూ నూతన ఇమిగ్రేషన్ బిల్లుకు రూపకల్పన చేసింది. ఈ బిల్లు అమెరికా ఎగువ సభ ముందుకు వచ్చింది. చర్చలో భాగంగా సెనేటర్ ఒర్రిహాచ్ గ్రీన్‌కార్డుల జారీలో దేశాల వారీగా కోటా విధించాలన్న నిబంధనను ఎత్తివేయాలని ప్రతిపాదించారు. మెరిట్ ప్రాతిపదికన విదేశీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ప్రతిపాదనకు సమ్మతించారు. ఈ సవరణకు ఆమోదం లభిస్తే అమెరికాలో భారీ ఎత్తున స్థిరపడిన ప్రవాస భారతీయులు, చైనీయులకు ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెప్తున్నారు.













