సామాజిక మాధ్యమాలపై డొనాల్డ్ ట్రంప్ ఫైర్
సామాజిక మాధ్యమాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫైర్ అయ్యారు. ట్విట్టర్, ఫేస్బుక్, గూగుల్ సంస్థలు నెటిజన్లను తప్పుదోవ పటిస్తున్నాయని ఆరోపించారు. రిపబ్లికన్ పార్టీకి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వార్తల్లో సగానికి పైగా తప్పుడు వార్తలే ఉంటున్నాయని అన్నారు. ఫాక్స్ బిజినెస్ నెట్వర్క్ మీడియా సంస్తకు ఇచ్చిన ఇంటర్వ్యులో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్లో తనకు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారని ట్రంప్ తెలిపారు. అయితే, తనను అనుసరించాలని భావించే కొత్తవారికి అవకాశం కల్పించట్లేదని మండిపడ్డారు. ట్విట్టర్ సంస్థ డెమోక్రటిక్ పార్టీ నేతలకు అనుకూలంగా పనిచేస్తోందని ఆరోపించారు. సామాజిక మాధ్యమాలకు రాజకీయ రంగు పులమడం సరైన చర్య కాదని గూగుల్ సంస్థ ప్రకటించింది. తమకు అందరూ సమానమేనని తెలిపింది. ఏ పార్టీ తమకు అనుకూలంగా కాదని, అలాగే ఏ పార్టీ కూడా వ్యతిరేకం కాదని సృష్టం చేసింది.













