ట్రంప్ ప్రకటించిన ఫేక్ న్యూస్ విజేతలు వీరే
ఆది నుంచి కూడా అమెరికాలోని కొన్ని మీడియా సంస్థలపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడుతున్న సంగతి తెలిసిందే. తప్పుడు వార్తలతో తనను బదనాం చేసేందుకు కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఎన్నో సార్లు బాహాటంగానే చెప్పారు. తాజాగా, ఆయన ఫేక్ న్యూస్ అవార్డులను ప్రకటించారు. ప్రముఖ దినపత్రిక ద న్యూయార్క్ టైమ్స్‌కు బెస్ట్ ఫేక్ న్యూస్ అవార్డు ప్రకటించారు. దీనితో పాటు సీఎన్ఎన్, ఏబీపీ న్యూస్, టైమ్, ద వాషింగ్టన్ పోస్ట్ తదితర సంస్థలను కూడా విజేతలుగా ప్రకటించారు. ఈ వివరాలను జీవోపీ.కామ్‌లో పొందుపరిచారు. దీని గురించి ట్రంప్ ట్వీట్ చేసిన నిమిషాల్లోనే ఆ వెబ్సైట్ క్రాష్ అయిపోయింది. జర్నలిజం రంగంలో తాను గౌరవించే గొప్ప జర్నలిస్టులు ఉన్నారని, కానీ మీడియా మాత్రం అవినీతి, కపట బుద్ధితో తప్పుడు కథనాలను ప్రచురిస్తోందని మరో ట్వీట్లో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.













